మంచు కుటుంబ వివాదం తెలిసిన విషయమే. కొన్నేళ్లుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లాలో పెదరాయుడి విద్యాసంస్థల కేంద్రం చుట్టూనే ఈ గొడవలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. ఇటీవల హై దరాబాద్లో జరిగిన వివాదం రచ్చయింది. తండ్రీ కొడుకులన్నాక కలిసుండాలనే కోరుకుంటారు. ఈ విషయంలో మంచు మనోజ్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మా ట్లాడిన మనోజ్ తన మనసలోని కోరికను బయటపెట్టాడు. తన తండ్రి పెదరాయుడి వద్దకు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకోవాలని, తన కూతురును ఆయన ఒడిలో పెట్టాలని ఉన్నట్లు చెప్పాడు. కానీ అలా చేస్తే చేయని తప్పును అంగీ కరిస్తున్నట్లు అవుతుందని చేయడం లేదన్న ఆయన ఇది తమ నాన్న నేర్పిన నీతిగా చెప్పుకొచ్చాడు. తామంతా కలిసి ఉండాలని కో రుకుంటున్నట్లు వెల్లడించాడు. గొడవ తాను పెట్టుకోలేదని, సమస్యలు సృష్టించిన వారు తప్పుని తెలుసుకుంటారనే నమ్మకం ఉందన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే భైవర మూవీతో ఆయన ప్రేక్షకులను పలకరించను న్నాడు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.