OTT Releases : ఈ వారం టిల్లు స్క్వేర్‌తో పాటు 17 సినిమాలు ఓటీటీలో రిలీజ్..
ఒక్క సినిమా వస్తేనే ఓటీటీ ప్రేక్షకులకు పండగ. అలాంటిది ఈ వారం 17 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యాయి. దీంతో.. శుక్రవారం కోసం ఓటీటీ మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.
సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, గోపీచంద్ భీమ వంటి క్రేజీ చిత్రాలు ఈలిస్ట్ లో ఉన్నాయి. ఒప్పందం ప్రకారం నాలుగు వారాలు ముగిసిన నేపథ్యంలో ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి ఈ మూవీస్. టిల్లు స్క్వేర్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 26 నుండి టిల్లు స్క్వేర్ స్ట్రీమ్ కానుంది. హీరో గోపీచంద్ నటించిన భీమ హాట్ స్టార్ లో ఏప్రిల్ 25 నుండి స్ట్రీమ్ కానుంది.
రిలీజ్ కు రెడీ అవుతున్న ఓటీటీ మూవీస్ ఇవే.
నెట్ ఫ్లిక్స్
ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ సిరీస్)-ఏప్రిల్ 23
బ్రిగంటి(ఇటాలియన్ సిరీస్)- ఏప్రిల్ 23
డెలివరీ మీ (స్వీడిష్ సిరీస్)- ఏప్రిల్ 24
సిటీ హంటర్(జపనీస్ సినిమా)- ఏప్రిల్ 25
డెడ్ బాయ్ డిటెక్టీవ్స్(ఇంగ్లీష్ సిరీస్)-ఏప్రిల్ 25
గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ సిరీస్)-ఏప్రిల్ 26
ద అసుంత కేస్(స్పానిష్ సిరీస్)-ఏప్రిల్ 26
టిల్లు స్క్వేర్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 26
అమెజాన్ ప్రైమ్
దిల్ దోస్తీ డైలమా (హిందీ సిరీస్)- ఏప్రిల్ 25
హాట్ స్టార్
భీమ – ఏప్రిల్ 25
థ్యాంక్ యూ గుడ్ నైట్(ఇంగ్లీష్ సిరీస్)-ఏప్రిల్ 26
క్రాక్(హిందీ చిత్రం)-ఏప్రిల్ 26
జియో సినిమా
ది జింక్స్ పార్ట్ 2(ఇంగ్లీష్ సిరీస్)-ఏప్రిల్ 23
వియార్ హియర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 27
ఆపిల్ ప్లస్ టీవీ
ది బిగ్ డోర్ ప్రైజ్ సీజన్ 2(ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 24
లయన్స్ గేట్ ప్లే
ది బీ కీపర్(ఇంగ్లీష్ సినిమా)- ఏప్రిల్ 26
బుక్ మై షో
కుంగ్ ఫు పాండా 4(ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ ఏప్రిల్ 26