Varalakshmi Sarathkumar : ఈ ఏడాదే నా పెళ్లి జరుగుతుంది: వరలక్ష్మీ శరత్ కుమార్
నికోలయ్ సచ్‌దేవ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లానని, ఇది సినిమా పట్ల తనకున్న కమిట్‌మెంట్ అని వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. కానీ ఈ ఏడాదే జరుగుతుంది. వివాహం తర్వాత కూడా నా కెరీర్‌ను కొనసాగిస్తా. అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఇప్పుడు జరిగిపోతోంది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం నా జీవితంలో ఉండదు’ అని పేర్కొన్నారు.
తను జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. పెళ్లి అనేది నా లైఫ్ లో సర్ప్రైజ్ అంటూ తెలిపింది. అసలు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. ఇప్పుడు నా జీవితంలో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అలా నా జీవితంలో తెలియని సంఘటన సాగిపోతుందంటూ తెలిపింది. ఇంతకంటే నా లైఫ్ లో ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదని ఆవిడ తెలిపారు. ఇక శబరి సినిమా గురించి చెబుతూ.. సినిమాలో ప్రేమను పంచే తల్లి కథ అని., ఓ తల్లి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందన్నది ఈ సినిమా కథ అని తెలిపింది.