Kingdom Movie : వీరమల్లుకే కాదు.. కింగ్ డమ్ కూ పెంచారు..

Update: 2025-07-24 10:39 GMT

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ఇవాళ విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా.. ప్రిమియర్స్ తో మంచి ఓపెనింగ్స్ మాత్రం వచ్చాయని చెప్పొచ్చు. అందుకు కారణం టికెట్ ధరలు భారీగా పెంచడమే అని వేరే చెప్పక్కర్లేదు. అఫ్ కోర్స్ అంత భారీగా తెలంగాణలో లేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెంచారు. హరిహర తర్వాత కింగ్ డమ్ టికెట్ రేట్లు కూడా పెంచుకునేందుకు ఏపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకపోతే హరిహర వీరమల్లు అంత భారీగా పెంచలేదు.

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన కింగ్ డమ్ ఈ నెల 31న విడుదల కాబోతోంది. సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది. అందుకే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ లో మార్పు లేకుండా చూసుకున్నారు. అంటే ఈ రిలీజ్ విషయంలో ఓటిటి సంస్థల ఒత్తిడి కూడా ఉండటం విశేషం. ఈ శనివారం కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. తిరుపతిలో ఈవెంట్ చేస్తున్నారు.

ఇక కింగ్ డమ్ కి ఏపిలో సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లలో 75 రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా కలుపుకుని టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ మేరకు విజయ్ సినిమాకు చాలా వరకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. తెలంగాణలో టికెట్ ధరలు పెంచము అని ఆ మధ్య వీరావేశంగా ప్రకటించింది ఇక్కడి ప్రభుత్వం. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు పెంచారు. అందుకే తెలంగాణకే చెందిన విజయ్ సినిమాకు పెంచుతారేమో చూడాలి.

Tags:    

Similar News