TikTok Durga Rao : దుర్గారావు క్రేజ్ మామూలుగా లేదుగా.. మరో ఛాన్స్ !

Bigg Boss 5 TikTok Durga Rao : సోషల్ మీడియా చాలా మందిని స్టార్స్‌ని చేస్తుంది. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.;

Update: 2021-02-08 12:30 GMT

Bigg Boss 5 TikTok Durga Rao : సోషల్ మీడియా చాలా మందిని స్టార్స్‌ని చేస్తుంది. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని బయటకు వెలికితీసే ఓ చక్కటి అవకాశం. ఇప్పుడు దుర్గారావు పేరు చెబితే తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు.. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి పెరిగి టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యారు.

భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తే కోట్లలో వ్యూస్ సంపాదించుకుంటున్నారు. రఘు కుంచె సంగీత సారధ్యంలో వచ్చిన నాదీ నక్కిలీసు గొలుసు పాటతో దుర్గారావు మరింత ఫేమస్ అయ్యారు. సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలను సొంతం చేసుకుంటున్న దుర్గారావుకి బిగ్‌బాస్ కూడా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సీజన్ 5కి ఓ కంటెస్టెంట్‌గా మారనున్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీలతో ఈ సారి హౌస్‌లో సందడి నెలకొననుందని తెలుస్తోంది. మొన్నటికి మొన్న జగపతిబాబు తన సినిమా (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్) ప్రీ రిలీజ్ వేడుకలో ఈ చిత్రంలోని ఓ పాటను దుర్గారావు చేత లాంఛ్ చేయించారు.

అదే సమయంలో దుర్గారావు జగపతిబాబుతో కలిసి ఓ స్టెప్ వేయాలనుందని అడిగారు. అందుకు ఆయన కూడా అంగీకరించి స్టేజ్‌పైకి వచ్చి డ్యాన్స్ చేయడంతో దుర్గారావు చాలా సంతోషించి ఎమోషన్ అయ్యారు. 

Tags:    

Similar News