Sukumar : 'రాజమౌళి సార్ మీకూ మాకు ఒకటే తేడా' : సుకుమార్
Sukumar : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఆర్ఆర్ఆర్'..;
Sukumar : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఆర్ఆర్ఆర్'.. ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్‌లో వచ్చిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మార్నింగ్ నుంచే అభిమానుల నుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటన బాగుందని, రాజమౌళి టేకింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు..
అందులో భాగంగానే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తాడు.. 'మీరు పక్కనే ఉన్న మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే మేం తలెత్తాలి', 'రాజమౌళి సార్ మీకూ మాకు ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే..' అని సుకుమార్ ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజమౌళిని సుకుమార్ ప్రశంసించిన సుకుమార్ పట్ల నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కాగా గతంలో సుకుమార్ కి తాను పెద్ద అభిమానని చెప్పుకొచ్చారు జక్కన్న.. మహేష్ వన్ నేనోక్కడే సినిమాలో ఓషాట్‌కి పెద్ద ఫ్యాన్ అని ఆ ఆలోచన తనకి ఎందుకు రాలేదని ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఇక గతేడాది సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.