Katrina Kaif: పెళ్లికాని ప్రసాద్‌కి 'మల్లీశ్వరి' స్పెషల్ ఇన్విటేషన్
Katrina Kaif: పెళ్లికాని ప్రసాద్‌గా వెంకటేష్ నటన ఆధ్యంతం ఆకట్టుకుంటుంది.;
Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి కూతురుగా మారనుంది. విక్కీ కౌశల్‌తో జీవితాన్ని పంచుకోనుంది. అయితే ఈ వివాహ వేడుకలకు కొద్దిమంది బంధుమిత్రులు, ఇతర ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న రాజస్థాన్‌లో జరగనున్న ఈ వివాహ వేడుకలకు అంతా సిద్ధమైంది. టాలీవుడ్‌లో ఆహ్వానం అందిన అతి కొద్ది మందిలో హీరో వెంకటేష్ ఒకరు. ఇప్పటికే ఆయనకు ఆహ్వాన పత్రిక అందినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ మల్లీశ్వరి సినిమాతో కత్రినా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. పెళ్లికాని ప్రసాద్‌గా వెంకటేష్ నటన ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తర్వాత కత్రినా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కత్రినా కెరియర్‌ని మార్చిన హీరోగా వెంకటేష్‌ని మెచ్చుకుంటూ వెంకిమామను స్పెషల్ గెస్ట్ ఖాతాలో వేసి పెళ్లికి ఆహ్వానించింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కత్రినా పెళ్లికి ఆహ్వానం అందుకున్న తొలి హీరో వెంకటేష్ కావడం విశేషం.