Kaikala Satyanarayana: టాలీవుడ్‌లో మరో విషాదం.. కైకాల కన్నుమూత

Kaikala Satyanarayana: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది.. సీనియర్‌ నటుడు.. కైకాల సత్యనారాయణ కన్నుమూశారు..

Update: 2022-12-23 06:10 GMT

Kaikala Satyanarayana: టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది.. సీనియర్‌ నటుడు.. కైకాల సత్యనారాయణ కన్నుమూశారు.. ఈ రోజు తెల్లవారు జామున 4 నాలుగు గంటలకు ఫిల్మ్‌ నగర్‌లో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25 న జన్మించాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడలో పట్టా పొందాడు.1960 ఏప్రిల్ 10 న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు,ఇద్దరు కొడుకులు.



తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా,పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించారు.కొన్ని వందల చిత్రాలలో నటించిన కైకాల కెరియర్లో వేయని పాత్ర అంటూ ఏదీ లేదనట్లు నటించేవారు. ఇక ఈయన ఏదైనా పాత్ర వేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి ఉండడం విశేషం.


తన గంభీరమైన కాయంతో, కంచుకంఠంతో మురిపించిన కైకాల... 1959లో సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు మొదటగా నటించారు. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. కైకాల రూపు రేఖలు యన్.టి.ఆర్‌లా ఉండటంతో ఆయనకు డూప్‌గా అనేక సినిమాల్లో నటించారు.1960లో యన్.టి.ఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో సత్యనారాయణకు ఒక పాత్రనిచ్చారు.


టాలీవుడ్ కు కైకాల లాంటి నటుడు దొరకడం ఒక గొప్ప వరం అని ఇండ్రస్ట్రీలో చెపుతుంటారు.. అలా సినీ ఇండస్ట్రీలో ఎదుగుతూ.. రమా ఫిలిం ప్రొడక్ట్స్ బ్యానర్ ను కూడా స్థాపించాడు.1996 లో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చాడు కైకాల. టీడీపీ తరుపున మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.. ఇక ఈయన బిరుదులు, ఈయన అవార్డులు చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉన్నాయి.


తన 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 770కి పైగా సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో జీవించాడు.. విలన్‌గా, కమిడియన్‌ సినిమాల్లో కీలక పాత్రలెన్నో చేశారు..తాను పోషించిన వైవిధ్య పాత్రలకు గుర్తింపుగా నవరస నటనా సార్వభౌమ బిరుదును పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు.


కైకాల యముడి పాత్రలో ఆయన నటన అసమాన్యం.. యమగోల,యమలీల,యముడికి మొగుడు చిత్రాల్లో యముడి పాత్రలో అలరించాడు. కృష్ణుడి, రాముడు అంటే యన్.టి.ఆర్ ఎలా గుర్తుకు వస్తారో యముడు అంటే సత్యనారాయణే గుర్తుకు వచ్చేవారు..పౌరాణికాల్లో రావణుడు,దుర్యోధనుడు,యముడు, ఘటోత్కచుడు పాత్రలతో పాటు..తండ్రి, తాత పాత్రల్లో ఒదిగిపోయేవారు కైకాల.

Tags:    

Similar News