దసరా.. టాలీవుడ్ బిగ్గెస్ట్ సీజన్స్ లో ఒకటి. ఈ టైమ్ లో రావడానికి పెద్ద హీరోలంతా నెలల ముందు నుంచే కర్చీఫ్ లు వేస్తుంటారు. ఈ సారి కూడా ఎన్టీఆర్ దేవర 1 ను దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదల చేస్తాం అని అనౌన్స్ చేశారు. ఆ డేట్ కూడా ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయిందే. అయితే సెప్టెంబర్ 27న రావాల్సిన పవన్ కళ్యాణ్ ఓ.జి వాయిదా పడింది కాబట్టి దేవరను దసరా నుంచి ముందుకు తెచ్చి సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ చేశారు. దీంతో దసరా బరిలో మరో పెద్ద తెలుగు సినిమా లేకుండా పోయింది. ఓ రకంగా ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలెవరూ ఇప్పటి వరకూ డేట్స్ అనౌన్స్ కూడా చేయకుండా ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. ఈ డేట్ కోసం జనవరి నుంచే తమ సినిమాల డేట్స్ ను అనౌన్స్ చేస్తుంటారు. అలాంటిది ఈ సారి ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి.
ఇప్పటి వరకూ దసరా బరిలో రవితేజ మిస్టర్ బచ్చన్ ఉంటుందనుకుంటున్నారు. కానీ ఈ మూవీని హడావిడీగానే ఆగస్ట్ 15కే రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా బరిలో నిలిచే ఛాన్స్ బాలయ్య 109వ సినిమాకు ఉంటుందనుకున్నారు. ఆ వైపు నుంచి ఎలాంటి అప్డేట్ కనిపించడం లేదు. ఇక గేమ్ ఛేంజర్ పరిస్థితీ ఇదే. రామ్ చరణ్ పోర్షన్ పూర్తయింది తప్ప షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉందనే చెబుతున్నారు. ఇటు పుష్ప 2 ను ఆల్రెడీ డిసెంబర్ అని చెప్పారు. మరి ఇంక స్టార్ హీరోలు ఎవరు ఉంటారు ఆ టైమ్ లో అంటే చెప్పడానికి పెద్దగా ఆన్సర్ లేదు అనే చెప్పాలి.
ఇలాంటి టైమ్ ను క్యాష్ చేసుకునేందుకు తమిళ్ హీరోలు కాచుకున్నారు.
తమిళ్ స్టార్ సూర్య కంగువాను దసరాకే విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టయాన్( వేటగాడు ) సినిమాను కూడా అక్టోబర్ లోనే రిలీజ్ చేస్తాం అంటున్నారు. చూస్తుంటే ఈ రెండు సినిమాలే ఈ సారి దసరా సందర్భంగా తెలుగు మార్కెట్ ను కొల్లగొట్టబోతున్నాయనిపిస్తోంది.