Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా..
Mahesh Babu: కరోనా అనేది టాలీవుడ్ సెలబ్రిటీల వరకు వచ్చేసింది.;
Mahesh Babu (tv5news.in)
Mahesh Babu: కరోనా అనేది టాలీవుడ్ సెలబ్రిటీల వరకు వచ్చేసింది. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడగా.. మెల్లగా టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా కోవిడ్ నిర్దారణ అవుతోంది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మికి పాజిటివ్ రాగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కరోనా అని తేలింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల న్యూ ఇయర్‌ను జరుపుకోవడానికి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్లారు. అక్కడ వారంతా సంతోషంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే తాజాగా ట్రిప్ నుండి వెనక్కి వచ్చిన మహేశ్‌కు కరోనా నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022