Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా..
Vishwak Sen: రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా విశ్వక్ సేన్‌కు కోవిడ్ నిర్దారణ అయ్యింది.;
Vishwak Sen (tv5news.in)
Vishwak Sen: టాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్‌ను ట్రోల్ చేసేవారు ఎంతమంది ఉంటారో.. దానికి ఫ్యాన్స్ అయిన వారు అంతకంటే ఎక్కవే ఉంటారు. అలాంటి యంగ్ హీరో ప్రస్తుతం కరోనా బారిన పడ్డాడు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా విశ్వక్ సేన్‌కు కోవిడ్ నిర్దారణ అయ్యింది.
విశ్వక్ సేన్.. తన టీమ్‌తో కలిసి కోవిడ్ సమయంలో ఎంతోమంది బాధితులకు అండగా నిలబడ్డాడు. అలాంటి తనకే కరోనా రావడం వల్ల తన అభిమానులు విశ్వక్ సేన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్.. తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' చిత్రాన్ని తెలుగులో 'ఓరి దేవుడా' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా విడుదలయ్యింది.