Prabhas : ప్రభాస్ కెరీర్ ను మార్చిన రెండు సినిమాలు

Update: 2024-10-23 09:18 GMT

ఈశ్వర్ గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ను తెలుగు ప్రేక్షకులు చాలా త్వరగానే స్టార్ ను చేశారు. వర్షం, ఛత్రపతి వంటి మూవీస్ తో క్లాస్ అండ్ మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ కూడా వచ్చింది. అయితే హిట్లున్నా.. కొన్నిసార్లు ప్రభాస్ నటనపై కామెంట్స్ వచ్చేవి. ఆ కామెంట్స్ కు ఛత్రపతి సమాధానం చెప్పింది. అయినా.. అతని డిక్షన్ పై విమర్శలు తగ్గలేదు. డైలాగ్స్ ను పట్టిపట్టి చెబుతున్నాడనీ.. తెలుగును స్పష్టంగా పలకలేకపోతున్నాడనీ.. మాటలు ముద్దగా వినిపిస్తాయనే విమర్శలు బాగా వచ్చాయి. అలాగే బాడీ లాంగ్వేజ్ పైనా కామెంట్స్ ఉన్నాయి. వీటన్నిటీ సమాధానం చెప్పిన సినిమాలు రెండు.

ఒకటి బుజ్జిగాడు, రెండు ఏక్ నిరంజన్. ఈ రెండిటినీ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాల్లో అతని స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. మాస్ లో ఫంకీనెస్ ను పర్ఫెక్ట్ గా పలికించాడు. సినిమాలు బ్లాక్ బస్టర్ కాదు. జస్ట్ హిట్స్. కానీ ఆ సినిమాలు ప్రభాస్ కెరీర్ నే మార్చివేశాయి. బాడీ లాంగ్వేజ్ మారింది. డైలాగ్స్ పలికే విధానం మారింది. అలవోకగా తెలుగును ఆడేసుకునేలా ప్రభాస్ ను తీర్చి దిద్దింది పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి.

బుజ్జిగాడులో చెన్నై నుంచి బస్ లో వస్తూ.. రజినీకాంత్ సినిమా పెట్టలేదనీ.. కండక్టర్ ను ‘రన్నింగ్ లో ఉన్న బస్ అద్దాలు పగలగొట్టుకుని రోడ్డు మీద ఎప్పుడైనా పడ్డావా,’‘టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ ను గుద్దేత్తే ఎలా ఉంటదో తెలుసా..’, ‘ఏండీ ఒక మాట మాట్లాడండే.. ఒక పాట పాడండే’ అంటూ త్రిషను టీజ్ చేస్తూ మోహన్ బాబును సవాల్ చేస్తున్నప్పుడు నిర్లక్ష్యపు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీస్ అప్పటి వరకూ ప్రభాస్ లో ఎవరూ చూడలేదు. అలాగే ఏక్ నిరంజన్ లోనూ దాదాపు ఇదే తరహా డైలాగ్ డెలివరీ.. కనిపిస్తుంది. ఇవన్నీ అతన్ని కొత్తగా చూపించాయి. ఇప్పుడు ఎలాంటి డైలాగ్ అయినా ఈజీగా చెప్పేస్తున్నాడంటే ఈ రెండు సినిమాలు అతనికి చాలా పెద్ద హెల్ప్ అయ్యాయనేది కాదనలేని సత్యం.

Tags:    

Similar News