బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడిపై దాడి వెనుక అండర్‌వరల్డ్ హస్తం ఉందా? ఇదే అనుమానాలు ముంబై పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలోనే దాడి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్‌ను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సైఫ్ ఇంట్లో పనిచేసిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముంబయిలో పలువురు ఇన్ఫార్మర్ల సాయంతో నిందితుడికి సంబంధించి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సైఫ్‌పై దాడి జరిగినప్పుడు చుట్టుపక్కల యాక్టివ్‌గా మెుబైల్ ఫోన్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరో వైపు సైఫ్ పై దాడి కేసులో మళ్లీ బాలీవుడ్ తారల్లో గుబులు మొదలయ్యిందని తెలుస్తోంది. గతంలో టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ ను 1997లో హత్య అండర్ వరల్డ్ హత్య చేసింది. ఇంకా రాకేష్ రోషన్, సల్మాన్ ఖాన్, వంటి వారిపై దాడులు జరిగాయి. పలువురికి బెదిరింపులు వచ్చాయి.