'వేర్ ఈజ్ ది పార్టీ' అంటూ 'వాల్తేరు వీరయ్య'లో మాస్క్ డ్యాన్స్ చేసి తెలుగు కుర్రకారు మనసులు దోచుకున్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్తోపాటు తెలుగులోనూ యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీనిపై తాజాగా ఊర్వశీ రియాక్టయ్యారు. అది మూవీ షూటింగ్లో క్లిప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. 'నేను యాక్ట్ చేస్తోన్న న్యూ ఫిల్మ్ 'గుస్పేటియా'. అందులో నాపై షూట్ చేసిన ఓ సీన్ ఇటీవల నెట్టింట వైరల్ గా మారింది. అది నన్నెంతో బాధించింది. సినిమా రిలీజ్కు ముందే వీడియోస్, ఫొటోలు లీక్ కావడం నిరాశకు గురిచేసింది. అది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో కాదు. ఏ అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావొద్దని కోరకుంటా' అని చెప్పారు. మరోవైపు టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలోనూ ఊర్వశీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా గణేషన్ డైరెక్ట్చేస్తున్న గుస్పేటియా మూవీ వచ్చే నెల 9న రిలీజ్ కానుంది. బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలోనూ ఊర్వశీ కీ రోల్లో కనిపించనున్నారు.