ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న ఇండియాలో అతిపెద్దదైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 మరోసారి తనదైన శైలిలో విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించనుంది. అదే ‘నయనం’. ఈ ఒరిజినల్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు.
లేటెస్ట్‌గా ఈ ఒరిజినల్ ఫస్ట్ లుక్‌ను జీ 5 విడుదల చేసింది. దీంతో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ ఒరిజినల్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ పరిచయం కాబోతున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు.
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వరుణ్ సందేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నాను. పోస్టర్‌ను గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయటం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్‌ను మరింతగా ఎలివేట్ చేసినట్లయ్యింది. డిసెంబర్ 19న జీ 5లో ప్రీమియర్ కానున్న నయనం ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను’ అన్నారు.