Varun Tej : పేరెంట్స్ కాబోతోన్న వరుణ్, లావణ్య

Update: 2025-05-06 08:00 GMT

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట తమ ఇంట్లోకి మరో బుజ్జి బేబీ రాబోతోందని ప్రకటించింది. త్వరలోనే లావణ్య, వరుణ్ తేజ్ తల్లితండ్రులు కాబోతున్నారు. ఇద్దరూ కలిసి గతంలో మిస్టర్, అంతరిక్షం అనే చిత్రాల్లో కలిసి నటించారు. మిస్టర్ షూటింగ్ టైమ్ లోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ వీరి ప్రేమ గురించి మినిమం కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఎంతలా అంటే మిస్టర్ 2017లో విడుదలైంది. కానీ 2023 లో వీరి పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకూ కూడా చిన్న రూమర్ కూడా రాకుండా చూసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరు చిత్రాల్లో నటించారు. వీరి గురించి ఎవరికీ డౌట్ కూడా రాలేదు.

ఫైనల్ గా మెగా ఫ్యామిలీని ఒప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పటి నుంచి లావణ్య త్రిపాఠి తన ఇంటి పేరు తొలగించుకుని లావణ్య కొణిదలగా మార్చుకుంది. మొత్తంగా మెగా ఫ్యామిలీలోకి మరో బేబీ రాబోతోందన్నమాట. 

Full View

Tags:    

Similar News