Ghani OTT Release : ఓటీటీలోకి గని.. ఎప్పుడంటే?
Ghani OTT Release : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గని.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.;
Ghani OTT Release : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గని.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. వరుణ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ఇక గని మూవీ ఓటీటీలో దర్శనం ఇచ్చేందుకు రెడీ అవుతోంది.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని 'ఆహా' ఇప్పటికే సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 6, 2022 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించారు.