పవన్ కళ్యాణ్ పూర్తిగా వదిలేశాడు అనుకున్న హరిహర వీరమల్లు మూవీ మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మొదట స్టార్ట్ చేసిన దర్శకుడు క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ మిగిలిన భాగాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కు సంబంధించి అంతా సెట్ చేశారు. కాకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టలేదు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ ను పోలిన పాత్ర చేయబోతున్నాడు. విశేషం ఏంటంటే.. అసలు పూర్తవుతుందా లేదా అనేది తెలియకుండానే నిర్మాత మార్చి 28న అంటూ రిలీజ్ డేట్ వేశాడు. అంటే ఆ మేరకు పవన్ కళ్యాణ్ నుంచి హామీ వచ్చిందనుకోవచ్చు. పవన్ లాంటి హీరో సినిమాను ఆయనకు తెలియకుండా రిలీజ్ డేట్ వేయరు కదా. సో.. ఈ మూవీ వస్తే విజయ్ దేవరకొండకు ఇబ్బందులు తప్పవు.
పవన్ వస్తే విజయ్ కి ఇబ్బందేంటీ అనుకుంటున్నారా.. మార్చి 28న ఆల్రెడీ విజయ్ దేవరకొండ సినిమాను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార బ్యానర్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా మార్చి 28న విడుదల చేస్తాం అని ప్రకటించారు. సో.. ఇప్పుడు అదే డేట్ కు పవన్ హరిహర వీరమల్లు వస్తోందంటున్నారు. అంటే వీరమల్లు వస్తే విజయ్ దేవరకొండ రావడం కష్టమే. పైగా ఇది సితార బ్యానర్. ఆ బ్యానర్ కు పవన్ తో పెద్ద రిలేషన్ ఉంది. సో.. వీరమల్లు నిజంగానే వస్తే విజయ్ దేవరకొండ మరో డేట్ చూసుకోవాల్సిందే.