తెలుగులో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ( Venu Swami ) చాలామందికి తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాలలో వేణు స్వామికి సోషల్ మీడియా, యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే వారిద్దరు విడాకులు తీసుకోవడంతో.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు వేణు స్వామి. ప్రభాస్ పెళ్లి గురించి, నయనతార పెళ్లి తర్వాత కష్టాల గురించి, అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్, తెలంగాణ రాజకీయాల గురించి వేణు స్వామి సంచలన జోస్యాలు చెబుతుంటారు.
పాలిటిక్స్ గురించి వేణు స్వామి చెప్పిన జోస్యాలు కూడా నిజమయ్యాయి. వేణు స్వామికి.. తాజాగా బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో వేణు స్వామి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. ఇప్పటికే వేణు స్వామితో చర్చలు చేశారు బిగ్ బాస్ ప్రతినిధులు. వేణుస్వామి కూడా ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్లో పాల్గొనేందుకు భారీగానే రెమ్యూనరేషన్ అడుగుతున్నారట వేణు స్వామి.
ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో… ఏ సెలబ్రిటీ అడగనంత రెమ్యూనరేషన్ వేణు స్వామి అడిగారట. ఆయన ఉంటే హౌజ్ లో అటెన్షన్ ఉంటుందని.. డ్రామా రక్తి కడుతుందని.. ఆయన అడిగినంతా ఇచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పుకున్నారని టాక్.