బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
నర్సింగ్ యాదవ్ మృతి పట్లు తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.;
ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 52 ఏళ్లు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పలు సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో నటించారు. నర్సింగ్ యాదవ్ మృతి పట్లు తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ ఉన్నారు.