ప్రముఖ లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ నటిస్తున్నట్లు తెలస్తోంది. నేడు లెజెండరీ క్లాసికల్ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి 108వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పిస్తూ.. తనలాగే రెడీ అయ్యి విద్యాబాలన్ ఫొటోలు దిగింది. అచ్చం ఎంఎస్ సుబ్బలక్ష్మిలా ఉన్న విద్యా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "నా చిన్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేవగానే నేను వినే మొదటి గొంతు సుబ్బులక్ష్మి గారిది. ఆమె ఓ ఆధ్యాత్మిక శక్తి. ఆమెకు ఇలా నివాళులర్పించడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది" అంటూ విద్యాబాలన్ రాసుకోచ్చారు. కాగా, ఇప్పటికే దివంగత నటి సిల్క్ స్మితా బయోపిక్ డర్టీ పిక్చర్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న విద్యాబాలన్ మళ్లీ మరో బయోపిక్‌లో నటించబోతున్నట్లు తెలుస్తుంది.