Vidyut Jammwal : హాలీవుడ్ కు మదరాసి విలన్

Update: 2025-09-08 08:36 GMT

ఇండియాలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రస్తుతం సూపర్ ఎక్స్ పర్ట్ అయిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది విద్యుత్ జామ్వాల్ మాత్రమే అని చెప్పొచ్చు. అతన్లా విన్యాసాలు చేసే హీరో, నటుడు ఇప్పట్లో కనిపించడం లేదు. రియలిస్టిక్ స్టంట్స్ తో వెండితెరపై అదరగొడుతుంటాడు విద్యుత్. రీసెంట్ గా మదరాసి మూవీలో విలన్ గా అతని ఎంట్రీ ఏ స్టార్ హీరోకూ తీసిపోని రేంజ్ లో కనిపిస్తుంది. కొన్నేళ్ల క్రితం తెలుగులో శక్తి సినిమాలోనూ ఆకట్టుకున్నాడు. తమిళ్ లో మురుగదాస్ తీసిన తుపాకి సినిమాతో అక్కడి ఆడియన్స్ కు ఫేవరెట్ విలన్ అయ్యాడు.

కొంత కాలంగా బాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు విద్యుత్ జామ్వాల్. ఇకపై విలన్ గా చేయను అని చెప్పాడు. కానీ మురుగదాస్ కోసం మదరాసిలో నటించాడు. ఈ పాత్ర పెద్దగా కనెక్ట్ కాలేదు కూడా. ఇక అతనిప్పుడు తన రేంజ్ ను హాలీవుడ్ వరకూ విస్తరించుకుంటున్నాడు. త్వరలోనే హాలీవుడ్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. ‘స్ట్రీట్ ఫైటర్ 2’ అనే టైటిల్ తో రూపొందబోతోన్న ఈ చిత్రంలో అతనితో పాటు ‘ఆక్వామేన్’ఫేమ్ జాసన్ మమోవా కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. విద్యుత్ ఈ మూవీలో ఇండియాను రిప్రెజెంట్ చేస్తూ కనిపిస్తాడట. ఇదే అతనికి ఫస్ట్ హాలీవుడ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ మూవీతో తనలోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రపంచానికి చూపించబోతున్నాడు విద్యుత్. మరి ఈ ప్రాజెక్ట్ అతని కెరీర్ కు ఎలాంటి టర్న్ ఇస్తుందో చూడాలి. 

Tags:    

Similar News