Bigg Boss 5 Telugu: ఎందుకు పింకీ ఇలా చేస్తోంది..? ఇదే తన గేమ్ ప్లానా..?
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో రోజులు గడుస్తున్న కొద్దీ ఆట మరింత ఆసక్తికరంగా మారుతోంది.;
Bigg Boss 5 Telugu (tv5news.in)
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో రోజులు గడుస్తున్న కొద్దీ ఆట మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నిరోజులు ఆ హౌస్‌లో ఉన్నందుకు హౌస్‌మేట్స్ ఎమోషన్స్ కూడా కంట్రోల్‌లో లేకుండా పోతున్నాయి. అందుకే కోపాలు, అలకలు, గొడవలు ఎక్కువయ్యాయి. టాస్క్‌లలో పోటీ ఎక్కువయ్యింది. చాలారోజుల తర్వాత నిన్నటి (శుక్రవారం) బిగ్ బాస్ ఎపిసోడ్ దాదాపు అందరు హౌస్‌మేట్స్ మధ్య గొడవ జరిగింది.
ఇటీవల బిగ్ బాస్.. హౌస్‌మేట్స్‌కు బీబీ హోటల్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో మానస్, ప్రియాంక బీబీ హోటల్‌కు వచ్చే హనీమూన్ కపుల్. సిరి, సన్నీ, కాజల్ ఆ హోటల్‌కు వచ్చే ఇతర గెస్ట్‌లు. ఆనీ మాస్టర్, షన్నూ, రవి, శ్రీరామచంద్ర హోటల్ స్టాఫ్. రెండు రోజులు హౌస్‌మేట్స్ అంతా ఇదే టాస్క్‌లో లీనమయ్యారు. దీని బట్టే కెప్టెన్సీ టాస్క్‌కు ఎవరు అర్హులు అనేది నిర్ణయించబడింది.
బీబీ హోటల్ టాస్క్‌లో స్టాఫ్ టీమ్ ఓడిపోయి.. గెస్ట్ టీమ్ గెలిచింది. అయితే వారందరూ కెప్టెన్ పోటీదారులు అయ్యారు. కానీ బిగ్ బాస్ అక్కడే ఒక ట్విస్ట్ పెట్టాడు. గెస్ట్ టీమ్ నుండి ఇద్దరు వరస్ట్ పర్ఫార్మర్స్‌ను ఎంచుకోమన్నారు. వారందరూ మానస్, ప్రియాంకలను వరస్ట్ పర్ఫార్ములుగా ఎంచుకున్నారు. దీనికి ప్రియాంక వాదించింది. ఇదంతా చూసిన నెటిజన్లు ప్రియాంక వల్లే మానస్ ఆడలేకపోయాడని తనను విమర్శించడం మొదలుపెట్టారు.
ఇక కెప్టెన్సీ టాస్క్‌లో ప్రియాంక కావాలని సన్నీ ఓడిపోయేలా చేసిందంటూ సన్నీ ఫ్యాన్స్ తనపై ఫైర్ అవుతున్నారు. మానస్, సన్నీలు సరిగ్గా ఆడకపోవడానికి ప్రియాంకనే కారణం అంటున్నారు. టాస్క్‌లలో తను ఆడకుండా, వాళ్లని కూడా ఆడనివ్వట్లేదని పింకీపై నెగిటివిటి పెరిగిపోయింది. ఇక అన్ని అడ్డంకులను దాటుకుంటూ రవి ఈవారం బిగ్ బాస్ కెప్టెన్ అయ్యాడు.