Vijay Devarakonda : 'జనగణమన' మూవీ పై విజయ్‌దేవరకొండ ఏమన్నారంటే..

Vijay Devarakonda : లైగర్ ఫ్లాప్ తరువాత విజయదేవరకొండ, చార్మీ, పూరీ స్పందనలపై అంతటా ఆసక్తి నెలకొంది;

Update: 2022-09-13 10:15 GMT

Vijay Devarakonda : లైగర్ ఫ్లాప్ తరువాత విజయదేవరకొండ, చార్మీ, పూరీ స్పందనలపై అంతటా ఆసక్తి నెలకొంది. సైమా అవార్డ్స్‌లో విజయదేవరకొండ రావడంతో ఇక సినీరిపోర్టర్స్ ఎప్పటిలాగే తమ వివాదాస్పద ప్రశ్నలను సంధించారు. విజయ్‌దేవరకొండని... జనగణమణ సినిమా ఇక నిలిపేసినట్లేనా అన్ని ప్రశ్నించారు. దీనికి విజయ్ సమాధానమిస్తూ... మనందరం సైమా వేడుకలో ఉన్నాం. ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చాంది. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ వద్ద.. దాని గురించి మరిచిపోండి అని కామెంట్ చేశారు. విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పూరీజగన్నాద్, విజయ్‌దేవరకొండ కాంబినేషన్‌లో చార్మీ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కనున్న మరో సినిమానే జనగనమణ. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మార్చ్‌లో కొంచం షూటింగ్ కూడా ప్రారంభించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే లైగర్ ఊహించని రీతిలో పరాజయం పాలవడంతో మేకర్స్ ఈ మూవీపై పునరాలోచనలో పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. చార్మీ, పూరీ కూడా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆరేళ్ల క్రితమే పూరీ జగన్నాధ్ ఈ మూవీ గురించి చెప్తూ వస్తున్నారు. మొదట మహేశ్‌బాబును సంప్రదిస్తే నో చెప్పడంతో.. విజయ్‌తో ఓకే చేశారు పూరీ టీం. ఇక జనగనమణ ఏమవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News