Vijay Devarakonda : విజయ్ దేవరకొండను వదిలేస్తారా

Update: 2025-05-05 13:24 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వల్ల చిక్కుల్లో పడ్డాడు. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన విజయ్ అంతకు ముందు జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడులపై స్పందించాడు. ఆ సందర్భంగా అతను పాకిస్తాను ఉద్దేశిస్తూ.. ఇప్పటికీ ఇంకా 500 యేళ్ల క్రితం ట్రైబల్స్ లాగా కొట్టుకోవడం ఏంటీ అని యధాలాపంగా అన్నాడు. దీంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ గిరిజనలు విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ లు పెట్టే ప్రయత్నం చేశారు. కేస్ నమోదైంది కూడా.

అయితే దీనికి విజయ్ దేవరకొండ సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడు. ట్రైబల్ అనే మాటకు ఉన్న అర్థాలు వివరిస్తూ ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశాడు. అలాగే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించే ప్రయత్నం చేస్తూ ఆఖర్లో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే సారీ అని కూడా చెప్పాడు. దీంతో కొంత వరకూ గొడవ చల్లారింది అనుకుంటున్నారు కానీ.. కొందరు దీన్ని ఇప్పట్లో వదిలేలా లేరు. అతనిపై నమోదైన కేస్ ను వెనక్కి తీసుకునేలానూ లేరు. నిజానికి అతని కామెంట్స్ లో జాతి గురించిన ఉద్దేశ్యాలేం లేవు అని ఎవరికైనా అర్థం అవుతుంది. కానీ సినిమా వాళ్లు ఎప్పుడూ ఈజీ టార్గెట్ అవుతారు కదా. అందుకే ఇలా..

Tags:    

Similar News