విజయ్ దేవరకొండ మోస్ట్ అవెయిటెడ్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కింగ్ డమ్ ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నామని నిర్మాత నాగవంశీ గతంలోనే చెప్పాడు. ఈ ఫస్ట్ పార్ట్ ను ఈ నెల 30న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ కు జనం ఫిదా అయిపోయారు. ఆ వాయిస్ తో సినిమాకు మాంచి హైప్ కూడా క్రియేట్ అయింది.
ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. అయితే ఇది లిరికల్ సాంగ్ కాదు. పూర్తిగా వీడియో సాంగ్. అలాగే అంతా ఊహించిన దానికి భిన్నంగా ఈ పాట టేకాఫ్ ఉండటం విశేషం. కంటెంట్ తో పాటు సాగే పాట ఇది. హీరో హీరోయిన్ లవర్స్ లా నటిస్తుంటారు. ఆమె వద్దకు అతను వెళతాడు. కానీ ‘ఇలా చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావు. మనం లవర్స్ లా యాక్ట్ చేస్తే చాలు.. నువ్వు జీవిస్తున్నావు..’అని తను తిడుతూ ఉటుంది. తర్వాత అతను వచ్చిన కార్ లో చూస్తే ఓ శవం ఉంటుంది. ఆ శవాన్ని చూసిన తను ‘సర్లే నేను ఢిల్లీకి ఇన్ఫార్మ్ చేస్తా’ అంటుంది. వెళ్తూ వెళ్తూ ‘సూరీ’ అని పిలిచి వెనక్కి వచ్చి అతన్ని కౌగిలించుకుని ముద్దు కూడా ఇస్తూ.. ‘కిటికీలో నుంచి నా రూమ్మేట్ చూస్తుంది’ అంటుంది. అలాగే ‘ఈ సారి వచ్చినప్పుడు తిట్టే వరకూ వెయిట్ చేయకుండా ఎందుకు వచ్చావో చెప్పమంటుంది. దానికి అతను నువ్వు కూడా తిట్టేముందే ఎందుకు వచ్చావో అడుగు అంటాడు. ఇలా ఒక ఇంటెన్స్ ఇంటరాక్షన్ తర్వాత ‘ఏదో ఏదో గమ్మత్తులా.. ఏంటీ కలా ఏంటీ కలా..’అంటూ పాట స్టార్ట్ అవుతుంది.
చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే .. దూకేశా అందుట్లో ఏముందీ నా తప్పే.. తూటాల వర్షాన పువ్వేదో పూసేనా.. లోకంకే చాటేనా హృదయం లోపల కదనం జరిగేనా అంటూ సాగే ఈ గీతాన్ని అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించి తనే పాడాడు. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాశాడు.
అనిరుధ్ పాట అని కాకుండా దీన్ని కేవలం గౌతమ్ తిన్ననూరి పాటగానే చూడాలి. మాంటేజ్ సాంగ్ గా కనిపిస్తోన్న ఈ గీతం మొత్తం ఓ బలమైన కథ నడుస్తోంది. హీర హీరోయిన్ ఇద్దరూ ఓ ప్రమాదకరమైన ‘మిషన్’పై పనిచేస్తున్నారని అర్థం అవుతోంది. ఆ మిషన్ వారి ప్రేమను మించింది అని తెలిసేలా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇద్దరి నటనలో ఓ బలమైన ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కథను, ప్రేమికుల సంఘర్షణను, కథ విలువను తెలియచెపుతూ సాగే మాంటేజ్ రాలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సినిమాపై అంచనాలూ పెంచేలా ఉందీ పాట.
గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ ఈ సారి బాక్సాఫీస్ ను స్ట్రాంగ్ గానే ఢీ కొట్టబోతున్నారు అనేలా ఉంది.