Vijay Fans get Engaged : 'లియో' స్ర్కీనింగ్ లో దండలు మార్చుకున్న విజయ్ ఫ్యాన్స్
'లియో' మూవీ స్ర్కీనింగ్ థియేటర్లో ఆశ్చర్యకరమైన ఘటన.. దండలు, రింగులు మార్చుకున్న విజయ్ అభిమానులు;
తమిళనాడులోని పుదుకోట్టైలోని ఓ సినిమా థియేటర్‌లో 'లియో' చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక జంట దండలు, ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
విజయ్ నటించిన 'లియో' చిత్రం ఈరోజు (అక్టోబర్ 19) విడుదల కాగా... అభిమానులు ఈ రోజును పండుగలా జరుపుకుంటున్నారు. ఒక్క తమిళనాడులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడంలో బిజీగా గడిపారు. ఇదిలా ఉండగా పుదుకోట్టైలోని లియో సినిమా ప్రదర్శింపబడుతున్న ఓ థియేటర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విజయ్‌కి వీరాభిమాని అయిన వెంకటేష్, మంజుల అనే జంట థియేటర్ లో నిశ్చితార్థం థియేటర్‌లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
థియేటర్‌లో పెళ్లి సొగసులతో ముస్తాబయిన ఈ జంట.. దండలు, ఉంగరాలు మార్చుకోగా చుట్టుపక్కల వారు ఆనందంతో ఉల్లాసంగా గడిపారు. వీరి చేష్టలకు పెళ్లికూతురు నవ్వడంతో ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ‘‘నాకు అమ్మ, నాన్న లేరు. విజయే నాకు సర్వస్వం. అందుకే అతని సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నాను” అని వెంకటేష్ చెప్పారు. “నేను 8 నెలలుగా దీని కోసం ఎదురు చూస్తున్నాను. రేపు పెరుమాళ్ గుడిలో మా పెళ్లి జరగబోతుంది’’ అని ఆయన చెప్పారు.
ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'లియో' చిత్రంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సౌత్‌లోని అనేక ప్రదేశాలు పూర్తి "బ్యాండ్ బాజా"తో సినిమా హాళ్లను అభిమానులు చుట్టుముట్టారు. తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ థియేటర్ వెలుపల లియో విడుదల సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'లియో'లో సంజయ్ దత్, త్రిష కృష్ణన్, అర్జున్ సర్జా కూడా ఉన్నారు. 'లియో' 2021 బ్లాక్‌బస్టర్ 'మాస్టర్' తర్వాత విజయ్ - కనగరాజ్‌ల కలయికను ఈ మూవీ సూచిస్తుంది. ఇటీవల, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా దళపతి విజయ్ - సంజయ్ దత్ చిత్రం 'లియో' గురించి మాట్లాడుతూ, "ఆ చిత్రం భారీ హిట్ కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.
In #Pudukkottai a couple exchanged their engagement ring and put Maalai on each other in front of #Leo in the morning show. @xpresstn #VijayThalapathy #VijayFans #LeoMovie #wedding pic.twitter.com/OsZMrh7iYm
— Iniya Nandan (@Iniyanandan25) October 19, 2023