విజయ్ సేతుపతి ఇకపై క్యారెక్టర్స్ చేయడం లేదు అని డిసైడ్ అయ్యాడు. విలన్ గా నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని కూడా లేడు. ఈ కారణంగానే ఈ మధ్య మెయిన్ లీడ్ లోనే కనిపించబోతున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో టబు, సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతున్నారు. ఇక ఆ తర్వాత అతను చేయబోయే సినిమా మాత్రం భారీ బడ్జెట్ తో ఉండబోతోంది. అందుకోసం బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ కూడా ఉండబోతోంది. అందుకోసం ఏకంగా సంజయ్ దత్ నే విలన్ గా తీసుకోబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
అజిత్ కుమార్, త్రిష, అర్జున్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన విడాముయర్చీ అనే చిత్రంతో దర్శకత్వం చేశాడు మగిళ్ తిరుమేని. అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ లోనే నటించబోతున్నాడు విజయ్ సేతుపతి. మగిళ్ ఈ కథ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. అజిత్ మూవీతో ఫ్లాప్ చూసిన ఈ దర్శకుడు ఎలాగైనా మరో మూవీతో విజయం సాధించాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతితో వర్కవుట్ చేయబోతున్నాడు.
ఆశ్చర్యం ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ గా విజయ్ సేతుపతికి జోడీగా శ్రద్ధా కపూర్ నటించబోతోంది. ఈమె ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రద్ధా కపూర్ మూవీ అంటే మాగ్జిమం వర్కవుట్ అవుతోంది. మరి అలాంటి టైమ్ లో తను హీరోయిన్ గా చేయడం అంటే విజయ్ సేతుపతికి ప్లస్ అవుతుంది. తమిళ్, హిందీ మార్కెట్ మూవీగా రూపొందబోతోందీ మూవీ. అదనంగా తెలుగు మార్కెట్ కూడా ప్లస్ కాబోతోందన్నమాట.