Maharaja OTT : జులై 19న ఓటీటీలోకి మహారాజ?

Update: 2024-06-28 07:16 GMT

తమిళ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ( Vijay Sethupati ) నటించిన ‘మహారాజ’ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తమిళం, తెలుగులో అందుబాటులోకి రానుందట. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో తెలుగులో అత్యధిక వసూళ్లు చేసిన తొలి చిత్రంగా 'మహారాజ' నిలిచింది. కానీ, తమిళంలో మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో థియేటర్లో ఇంకా సక్సెఫుల్‌గా దూసుకుపోతుంది.

నితిల‌న్ సామినాథ‌న్ తెరకెక్కించిన మహారాజ సినిమాలో అనురాగ్ క‌శ్యప్‌, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌, అభిరామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో మ‌హారాజ (విజ‌య్ సేతుప‌తి) ఓ బార్బర్‌. త‌న కూతురితో క‌లిసి నగరానికి దూరంగా ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అయితే ఓ రోజు కొంద‌రు దుండగులు మహరాజ ఇంటిపై దాడిచేసి ల‌క్ష్మిని ఎత్తుకుపోయార‌ని మ‌హారాజ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు. మరి ఇంత‌కు ల‌క్ష్మి ఎవ‌రు? మహారాజ కంప్లైంట్‌ను పోలీసులు ఎందుకు సీరియ‌స్‌గా తీసుకోలేదు. త‌న కూతురిపై జ‌రిగిన అన్యాయానికి మ‌హారాజ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ కథ. ప్రస్తుతం ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది.

Tags:    

Similar News