నటులు పుట్టరు తయారవుతారు అంటూ సరికొత్త స్ట్రాటజీతో ఫిల్మ్ స్కూల్ రన్ చేస్తున్నాడు వినోద్ నువ్వుల. హీరోగా 6 సినిమాలు, నటుడుగా 70కి పైగా చిత్రాల్లో నటించిన వినోద్.. కొన్నాళ్ల క్రితమే ‘వినోద్ ఫిల్మ్ అకాడెమీ’ని స్థాపించాడు. తను స్వతహాగానే ఫిల్మ్ స్కూల్ లో నటన నేర్చుకున్నవాడు కావడంతో.. ఆ అనుభవంతో పాటు తను సినిమాల్లో చేసిన అనుభవాన్ని రంగరించి మొదలుపెట్టిన ఈ ఫిల్మ్ స్కూల్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవవంతంగా రన్ అవుతోంది. ఈ స్కూల్ లో నటన నేర్చుకున్న అనేక మంది సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ లు, ఓటిటి మూవీస్ లో నటిస్తూ రాణిస్తున్నారు.
ప్రస్తుతం సీనియర్ నటుడు కిశోర్ దాస్ ప్రిన్సిపల్ గా, బబ్లూ ఓ టీచర్ గా కొనసాగుతున్న ఈ ఫిల్మ్ అకాడెమీ నుంచి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం ఇప్పటి వరకూ ఏ ఫిల్మ్ స్కూల్ తీసుకోలేదు. ఓ రకంగా ఇది అక్కడ నటన నేర్చుకునేవాళ్లకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ వినోద్ ఫిల్మ్ అకాడెమీలో నటన నేర్చుకున్న వాళ్లకు ఖచ్చితంగా సినిమా, వెబ్ సిరీస్, ఓటిటి మూవీస్.. ఇలా ఏదో ఒక దాంట్లో నటించే అవకాశాన్ని ఫిల్మ్ స్కూలే స్వయంగా కల్పించబోతోంది. అంటే మొదటి అవకాశాన్ని కూడా వాళ్లే ఇప్పిస్తారు. ఇందుకోసం కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలతో టై అప్ అయ్యారు. మరి దీనికి సబంధించిన వివరాలేంటీ.. వీళ్లు ఎలా ఆ హామీని నిలబెట్టుకుంటారో.. ఈ వినోద్ ఫిల్మ్ అకాడెమీ ఛైర్మన్ వినోద్ టివి 5 ఎంటర్టైన్మెంట్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మీరే చూడండి.