Viswak Sen : దీపావళికి మెకానిక్ రాఖీ
ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ఆకట్టుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్ట్స్ మూవీ మెకానిక్ రాఖీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు.;
ఈ యేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో సందడి చేసిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో మూవీతో రెడీ అవుతున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి డిఫరెంట్ టాక్ వచ్చినా కమర్షియల్ గా బానే వర్కవుట్ అయింది. గామి వైవిధ్యమైన ప్రయత్నం అనిపించుకుంది. కానీ బాగా గ్యాప్ వచ్చిన సినిమా కావడంతో ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా.. ఓవరాల్ గా మెప్పించలేదు. కానీ విశ్వక్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈటైమ్ లో మరో మాస్ మూవీతో వస్తున్నాడు మాస్ కా దాస్.
చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయిన సినిమా మెకానిక్ రాఖీ. కాకపోతే అప్పటి నుంచి పెద్దగా అప్డేట్ కనిపించలేదు. మధ్యలో టైటిల్ అనౌన్స్ చేశారంతే. కానీ అతని ఇతర సినిమాల ప్రమోషన్స్ లో కూడా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈ టైమ్ లో సడెన్ గా దీపావళి సందర్భంగా అక్టోబర 31న విడుదల చేస్తున్నాం అని డేట్ అనౌన్స్ చేయడం విశేషం. అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఒక చేతిలో మెకానిక్ రెంచ్ తో పాటు మరో చేతిలో తుపాకీ పట్టుకుని అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు విశ్వక్ సేన్. అతని సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.
నిజానికి తెలుగులో దీపావళి టైమ్ లో పెద్ద సినిమాలు ఉండవు. ఈ గ్యాప్ ను ఎక్కువగా తమిళ్ వాళ్లు ఆక్యుపై చేస్తుంటారు. ఈ ట్రెండ్ గత రెండు మూడేళ్లుగా మారుతోంది. ఆ టైమ్ లో మనవాళ్లూ వస్తున్నారు. సో.. విశ్వక్ చాలా ముందుగానే అనౌన్స్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇతర హీరోలు కూడా కాస్త చూసుకునే తమ సినిమాలు అనౌన్స్ చేస్తారు.