Aditya : మనసంతా నువ్వే డైరెక్టర్ ఆదిత్య కొత్త సినిమా రెడీ

Update: 2024-07-12 08:52 GMT

మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను లాంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, లేదంటే కమర్షియల్ హంగులతో ఉన్న సందేశాత్మక చిత్రం అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.

కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎన్ ఆదిత్య గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలు కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీఎన్ ఆదిత్య సినిమాలకు సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుంది. డాలస్ లో నటీనటులు, క్రూతో దిగిన ఫొటోను షేర్ చేశారు ఆదిత్య.

Tags:    

Similar News