ఆదివారం రోజున ఇండియన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ కు అస్వస్థత అనగానే ఒక్కసారిగా సినిమా లోకం అంతా ఉలిక్కిపడింది. ఇవాళ రేపు చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. పైగా ఆయన హార్ట్ ప్రాబ్లమ్ తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు అనగానే అభిమానులంతా తమ ఇష్ట దైవాలను ప్రార్థించారు ఆయనకు ఏమీ కాకూడదు అని. అందరి ప్రార్థనలు ఫలించాయో ఏమో.. రహమాన్ సేఫ్ గా డిశ్చార్జ్ కూడా అయి అదే రోజు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అసలు ఆయనకు ఏమైందీ అనే డౌట్ చాలామందిలో ఉంది.
అయితే రహమాన్ హార్ట్ ప్రాబ్లమ్ తో హాస్పిటల్ లో జాయిన్ కాలేదు. పని ఒత్తిడి కారణంగా డీ హైడ్రేషన్ తో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తి కాస్త అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత కొన్ని మందులు ఇచ్చి రహమాన్ ను ఆదివారం మధ్యాహ్నమే ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.