Anasuya Bharadwaj : 'ఆచార్య'లో అనసూయ.. భారీగానే రెమ్యునరేషన్..!
Anasuya Bharadwaj : స్టార్ యాంకర్ అనసూయ 'జబర్దస్త్' వంటి షోలే కాకుండా వెండితెరపై కూడా మెరుస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉంది.;
Anasuya Bharadwaj : స్టార్ యాంకర్ అనసూయ 'జబర్దస్త్' వంటి షోలే కాకుండా వెండితెరపై కూడా మెరుస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. సినిమాల్లో ఎక్కువగా తనకు పేరు తెచ్చే బలమైన పాత్రలనే ఎంచుకుంటుంది. గతేడాది వచ్చిన 'పుష్ప' సినిమాలో కూడా ఆమె పూర్తి భిన్నమైన పాత్రలో నటించి మెప్పిచింది.. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న 'గాడ్‌ఫాదర్', 'ఆచార్య' చిత్రాల్లో ఆమె నటిస్తోంది.
అయితే మెగాస్టార్ 'ఆచార్య'లో ఆమె పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం.. 'ఆచార్య'లో అనసూయ పాత్ర కాస్త పవర్ ఫుల్‌గా ఉంటుందట. ఈ సినిమాకి ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటున్నాయి. అనసూయ ఇంతకుముందు కనిపించని కొత్త లుక్‌లో ఇందులో కనిపించబోతోందని తెలుస్తోంది.. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా రూ.25 లక్షల వరకు రెమ్యూనరేషన్‌ని అందుకుందని సమాచారం.
ఈ సినిమా నుంచి అయితే ఆమె మేకోవర్ ఫోటోలు ఇంకా విడుదల కాలేదు కానీ ఈ సినిమాకి అనసూయ పాత్ర కూడా చాలా కీలకం అని తెలుస్తోంది. ఇక 'ఆచార్య' చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన రెండు పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి. ఏప్రిల్ 29న మూవీ రిలీజ్ కానుంది.