Karthikeya : జాడలేని హీరో కార్తికేయ

Update: 2025-05-17 11:00 GMT

సెకండ్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసింది కార్తికేయకు. ఆర్ఎక్స్ 100 ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ఆ విజయం అతనికి ఓ పదికి పైగా సినిమాల కెరీర్ ను ఇచ్చింది. ఇంకా పది కాలేదు కానీ.. చేసిన వాటిలో విజయాల శాతం గురించి అడిగితే అతి తక్కువ అని చెప్పాల్సి వస్తుంది. అందుకే కొన్నాళ్లుగా పెద్దగా కనిపించడం లేదు. అతని చివరి రెండు సినిమాలు బెదురులంక 2012, భజే వాయువేగం.. ఈ రెండూ కమర్షియల్ గా వర్కవుట్ అయ్యాయని చెప్పుకున్నారు. బట్ ఇప్పుడేం చేస్తున్నాడు అంటే సాలిడ్ అప్డేట్స్ అంటూ ఏం కనిపించడం లేదు.

కొత్త సినిమాలు చేయకపోయినా నిత్యం వార్తల్లోనే ఉండాలి. అప్పుడే యాక్టర్స్ కు గుర్తింపు. కొన్నాళ్లు పోతే అసలుకే మర్చిపోయే ప్రమాదం ఉంది. కార్తికేయ మరీ తీసిపడేసే నటుడు కాదు. హీరోగా ప్రయోగాలు చేశాడు. నటుడుగా నెగెటివ్ రోల్స్ కూడా చేశాడు. ఈ రోల్స్ లో బాగా మెప్పించాడు కూడా. పైగా కోలీవుడ్ లో అజిత్ లాంటి హీరోకు విలన్ గా నటించాడు. ఇవీ కాక చివరి రెండు సినిమాలూ హిట్ అని చెప్పుకున్నారు. అంటే నెక్ట్స్ ఏంటీ అనే ప్రశ్న వస్తుంది కదా.. ఆ ప్రశ్నకే ఆన్సర్ లేదు. అతనూ కనిపించడం లేదు. దీంతో అసలు అతనికి ఏమైంది.. ఎక్కడ ఉన్నాడు అంటున్నారు చాలామంది. మరి కార్తికేయ సినిమాలు చేస్తున్నాడా లేక తప్పుకున్నాడా అనేది ఇకనైనా చెబుతారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News