Bheemla Nayak: పవన్, రానా సరసన ముందనుకున్న హీరోయిన్లు ఎవరంటే..
Bheemla Nayak: నిత్యామీనన్.. తన పాత్రకు సరైన ప్రాముఖ్యత లేకపోతే.. నిర్ధాక్షణ్యంగా నో చెప్పేస్తుంది..;
Bheemla Nayak: నిత్యామీనన్.. తన పాత్రకు సరైన ప్రాముఖ్యత లేకపోతే.. నిర్ధాక్షణ్యంగా నో చెప్పేస్తుంది.. మరి ఇక్కడ చూస్తే పవన్‌ని హైలెట్ చేసే సినిమా.. అయితేనేం ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత కల్పించాడు దర్శకుడు.. నిజానికి మాత్రుక మలయాళ సినిమాలో ఆ పాత్ర పరిధి చాలా తక్కువ.. తెలుగులో కొంచెం పెంచారు..
అయితే ముందు చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు సాయి పల్లవిని సంప్రదించారట. ఆమె కూడా భీమ్లానాయక్‌లో నటించేందుకు ఒప్పుకుంది.. కానీ తన ఇతర ప్రాజెక్టుల కారణంగా డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది.. దాంతో ఆ పాత్ర నిత్యామీనన్‌ని వరించింది.
ఇక రానాతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఐశ్వర్యా రాజేష్‌ని అనుకున్నారు దర్శక నిర్మాతలు.. కానీ ఆమెది కూడా అదే పరిస్థితి.. ఇతర షెడ్యూల్స్‌తో బిజీ.. ముందు ఓకే చేసినా తరువాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. సంయుక్త మీనన్ తెరపైకి వచ్చింది.. ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది ఆమె నటన ఈ చిత్రంలో.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ మలయాళీ కుట్టి స్పష్టమైన తెలుగు మాట్లాడి తెలుగు వారి హృదయాలను దోచుకుంది. సినిమా విడుదలకు ముందే మంచి మార్కులు కొట్టేసింది.