మా వ్యాపారాలు మీకెందుకు.. అంటున్నాడు నిర్మాత టిజి విశ్వ ప్రసాద్. ఈ మధ్య కాలంలో మా బిజినెస్ ల గురించి తెగ మాట్లాడుకోవడం ఏమంత కరెక్ట్ కాదు. ప్రేక్షకులకు కావాల్సింది సినిమాల ఎక్స్ పీరియన్స్. అది చాలు. అంతే కాదు.. మా యాపారాలు, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్స్ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అంటున్నాడు.
‘‘మా అతిపెద్ద సినిమా వ్యాపారం చుట్టూ చాలా సందడి ఉంది. మేము అంతర్గత ఖర్చులు లేదా సంఖ్యల గురించి బహిరంగంగా చర్చించము. మాకు మరియు అభిమానులకు నిజంగా ముఖ్యమైనది థియేటర్ అనుభూతి. విడుదల తర్వాత, మేము అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ గణాంకాలను పంచుకుంటాము. సినిమా దశలవారీగా సాగుతుంది. నేడు, నాన్-థియేట్రికల్ మార్కెట్ సహజంగా వెళుతోంది. థియేటర్లు నిజమైన తీర్పును అందిస్తూనే ఉన్నాయి. ఈ దశలో కూడా, మా సినిమా నేడు అందుబాటులో ఉన్న అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను పొందింది. పోలికలు అనవసరం. రాజాసాబ్ అనేది థియేటర్లలో గర్జించడానికి రూపొందించబడిన భారీ హర్రర్-ఫాంటసీ. స్క్రీన్‌లు మాట్లాడనివ్వండి..’’ఇదీ అతను చెప్పిన విషయం.
అంటే ఈ మధ్య కాలంలో అతని మూవీస్ వరసగా పోతున్నాయి. తాజాగా మోగ్లీ కూడా ఫ్లాప్ అయింది. ఈ టైమ్ లో అతని రాజా సాబ్ గురించి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. అదే టైమ్ లో చాలా ఇంటర్వ్యూస్ లో అతను బిజినెస్ ల గురించి మాట్లాడుకోవడం మాట్లాడ్డం జరుగుతోంది. దీంతో పాటు రాజా సాబ్ గురించి అనేక అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. వీటి మొత్తం గురించి అతను ఇలాగే రియాక్ట్ అయ్యాడు. తన ఎక్స్ ఖాతాలో చేసిన ఈ పోస్ట్ పట్ల భిన్నంగా మాట్లాడుతున్నారు. అంటే రాజా సాబ్ అతనికి ఎక్స్ పెక్ట్ చేసిన బిజినెస్ జరగలేదు కారణంగానే ఇతను మాట్లాడుతున్నాడా అనుకుంటున్నారు.