ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ఈ పదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక హీరో అభిమానులు సంబరాలు చేసుకుంటే మరో హీరో అభిమానులు సమస్యలు సృష్టిస్తున్నారు. అలా అందరూ దేవరపై పడ్డారు. అదే పనిగా ఈ మూవీపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నా.. ఎందుకో వారి బలం సరిపోవడం లేదేమో అనిపిస్తుంది. అవతలి వైపు అంత దాడి జరుగుతోంది. ఓవైపు దేవర నార్త్ అమెరికాలో అప్పుడే రికార్డ్స్ క్రియేట్ చేసింది. బుక్ మై షోలో అదరగొడుతోంది. అయినా నెగెటివ్ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.
ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రోల్స్ మరింత పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ఆంధ్రావాలాతో పోలుస్తున్నారు చాలామంది. ఆ మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించాడు. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దేవరలో కూడా తండ్రి కొడుకులుగానే నటించాడు.. దీంతో ఆంధ్రావాలా రిజల్టే రిపీట్ అవుతుందనే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అప్పటికీ ఇప్పటికీ ఎన్టీఆర్ చాలా మారాడు. అతని ఇమేజ్ పది రెట్లు పెరిగింది. అయినా ఆ కంపేరిజన్స్ ఆగడం లేదు.
ఇక మరికొంతమంది దమ్ముతోనూ పోలుస్తున్నారు. ఇందులో తండ్రి కొడుకులుగా నటించలేదు. అయితే దమ్ము టైమ్ లో విపరీతమైన హైప్ వచ్చింది. బోయపాటి అప్పటికే సింహా వంటి బ్లాక్ బస్టర్ తీసి ఉన్నాడు. బాబాయ్ కి బ్లాక్ బస్టర్ అబ్బాయికి ఇండస్ట్రీ హిట్ అన్నారు. బట్ దమ్ము దారుణమైన ఫ్లాప్ గా మిగిలింది. ఇప్పుడు దేవరను కూడా అలాగే హైప్ చేస్తున్నారు. ఇదీ దమ్ములాగే మిగిలిపోతుందంటున్నారు.
వీటితో పాటు దర్శకుడు కొరటాల శివను కూడా వదలడం లేదు. ఇంకా చెబితే కొరటాల ప్రీవియస్ మూవీ ఆచార్యతో దేవరను కంపేర్ చేస్తున్నారు. ఇది మరో పాదఘట్టం కాబోతోందంటూ కొన్ని రిఫరెన్స్ లు పెడుతూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటి పోలికలు ఎలా ఉన్నా.. ఫ్యాన్స్ హైప్స్ ఎలా ఉన్నా.. ఏ సినిమా అయినా.. అందులో కంటెంట్ ఉంటే చాలు.. మిగతాది ఆడియన్స్ చూసుకుంటారు. కాకపోతే ఆంధ్రావాలా, దమ్ము, ఆచార్య అంటుంటేనే ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా భయపడుతున్నారు.