ప్రస్తుతం ఇండియాలో హయ్యొస్ట్ రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో దీపికా పదుకోణ్ ముందు వరుసలో ఉంది. టైర్ 2 హీరో రేంజ్ లో తన పారితోషికం ఉంటోంది. అంటే ఆ స్థాయిలోనే తనకు డిమాండ్ ఉందని అర్థం. అలాంటి బ్యూటీని ఆ మధ్య నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రంలో తీసుకున్నారు. ఆశించినంత కాకపోయినా కల్కి హిట్ అయింది. పైగా ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమా హేమీలు కూడా నటించారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా కల్కి 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీలో దీపికా పదుకోణ్ ఉంటుందా లేదా అనే డిస్కషన్స్ నడిచాయి. అందుకు కారణం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ.
స్పిరిట్ మూవీలో కూడా ప్రభాస్ సరసన తీసుకుందాం అనుకున్నాడు సందీప్ రెడ్డి. కానీ ఆ సినిమాలో నటించాలంటే తను కేవలం 8 గంటలే పనిచేస్తా అనే కండీషన్ పెట్టింది దీపికా. కుదరదు అని చెప్పాడు సందీప్. తను తప్పుకుంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సందీప్. దీంతో ఇద్దరికీ మద్ధతుగానూ వ్యతిరేకంగానూ నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. అప్పుడే దీపికా పదుకోణ్ ను కల్కి 2 నుంచి తప్పిస్తారు అనే చర్చలు సాగాయి. అవి ఇప్పుడు నిజం అయ్యాయి. విశేషం ఏంటంటే.. అప్పట్లో ఈ విషయాన్ని ఖండించారు కల్కి మేకర్స్. కానీ ఇప్పుడు వాళ్లే అఫీషియల్ గా తమ ఎక్స్ ఖాతాలో ప్రకటించారు.
చాలాకాలం జర్నీ అయిన తర్వాత కూడా సెకండ్ పార్ట్ కు కలిసి .. చాలా జాగ్రత్తగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మేం దీపికాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నాం. అంటూ ఒక పోస్ట్ పెట్టారు.
ఈ మూవీ తనను ఎందుకు తప్పించారు అనే విషయంలో ఎవరూ ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. ఒకవేళ దీపికా ఏమైనా అదనపు డిమాండ్స్ చేసిందా..? వీరికీ టైమ్ లైన్ పెట్టిందా..? లేక తన వేరే ప్రాజెక్ట్స్ కారణంగా డేట్స్ ఇవ్వలేకపోయిందా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే దీపికా కొన్ని విషయాలు సీరియస్ గానే తీసుకుంటుంది. అందుకే తన వైపు నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే కానీ అసలు విషయం తేలదు.