ఒకప్పుడు విశాల్ మూవీస్ అంటే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్య విశాల్ వార్త అంటే అతని అనారోగ్యం గురించే వస్తోంది. కొన్నాళ్ల క్రితం ఓ స్టేజ్ పై వణుకుతూ మాట్లాడి అందరూ షాక్ అయ్యేలా చేశాడు. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అలాగే రీసెంట్ గా ఓ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లి కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో అసలు విశాల్ కు ఏమైంది అంటూ ప్రతి ఒక్కరూ ఆరాలు తీస్తున్నారు. మరోవైపు ఇక అతను తిరిగి సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్స్ కూడా చేశారు. ఈ టైమ్ లోనే నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు.
ఆరోగ్యం కుదుటపడిందో లేక ఇలాగే ఉంటే తనపై ఇంకా రూమర్స్ వస్తాయి అనుకున్నాడో కానీ తాజాగా అతని కొత్త సినిమా ను ప్రారంభించారు. ఇది విశాల్ కు 35వ సినిమా. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. వరుస విజయాలతో ఉన్న దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవి అరసు దర్శకుడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. అయితే విశాల్ కు యాక్షన్ హీరోగానే ఎక్కువ పేరుంది. ఆ ఇమేజ్ తోనే ఈ చిత్రమూ ఉంటుందా లేక సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఇమేజ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందా అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఓపెనింగ్ టైమ్ లో కూడా విశాల్ కాస్త ఇబ్బందిగానే కనిపించడం గమనార్హం.