Tollywood : తెలుగు ప్రేక్షకులకు మళ్లీ హలో చెబుతుందా !

Update: 2025-03-27 13:00 GMT

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'హలో' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ము ద్దుగుమ్మ కల్యాణి ప్రియదర్శన్. ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ.. కల్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. అనంతరం సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలోనటించినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళం లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది . ఫస్ట్ మూవీ మరక్కార్ డిజాస్టర్ అయినప్పటికీ 'హృదయం'తో కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మా రిపోయింది. ఆ తర్వాత చేసిన బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా, ఆంటోనీ, వర్షంగళక్కు, శేషం సినిమాలు కల్యాణి ని మలయాళ ఇండస్ట్రీలో హై డిమాండ్ హీరోయిన్ గా మార్చేశాయి. ఎట్ ప్రజెంట్ ఆమె చేతిలో త్రీ ప్రా జెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న జీనిలో నటి స్తోంది. రవి మోహన్ హీరో. కృతి శెట్టి మరో హీరోయిన్. అలాగే మలయాళంలో రెండు క్రేజీ యెస్ట్ సినిమాలు చేస్తోంది. ఫహాద్ ఫజిల్ సరసన ఒడుం కుతిర చద్దాం కుతిరాతో పాటు దుల్కర్ సల్మాన్ బ్యానర్ వే ఫారర్ ఫిల్మ్స్ పతాకంపై మరో మూవీ చేస్తోంది. కాగా, తాజాగా మరో తమిళ ప్రాజెక్టుకు కమి టైనట్లు టాక్. కార్తీ 29లో ఈమెనే హీరోయిన్ అని చర్చ నడుస్తోంది. మరీ ఇటు కోలీవుడ్, మాలీవుడ్ పై ఫోకస్ చేస్తూ ఆరేండ్లు టాలీవుడ్ ను మర్చిపోయిన ఈ బ్యూటీ.. తెలుగు ప్రేక్షకులకు మళ్లీ హలో చెబుతుందో చూడాలి.

Tags:    

Similar News