Payal Rajput : చేతిలో ఒకే సినిమా.. పాయల్ కు సక్సెస్ వచ్చేనా?

Update: 2025-06-10 12:00 GMT

యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్ . ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించు కుంది. అనంతరం ఎన్టీఆర్: కథానా యకుడు, ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగళవారం, రక్షణ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ వీటిలో మంగళవారం సినిమా తప్ప మిగిలినవేవి హిట్ కాలేదు. ఆ తర్వాత అయినా మళ్లీ కెరీర్ ట్రాక్ ఎక్కుతుంది అనుకుంటే అది జరగలేదు. తెలుగు తోపాటు హిందీ, కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మకు అక్కడ సైతం నిరాశే ఎదురైంది. ఐతే ప్రస్తుతం పాయల్ చేతిలో ఆది సాయి కుమార్ ' కిరాతక' ఉంది. తమిళ్ లో రెండు (గోల్ మాల్, ఏంజెల్) చిత్రాలు చేస్తోంది. ఈ 3 సినిమాలతో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తుంది. మరోవైపు ఆర్ఎక్స్ బ్యూటీ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే రానున్న చిత్రాలతో నైనా ఈ అమ్మడికి సక్సెస్ రావాలని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News