RRR Sequel : RRRకి సీక్వెల్.. విజయేంద్రప్రసాద్ ఏం అన్నారంటే?
RRR Sequel : టాలీవుడ్ టాప్ రైటర్ లలో విజయేంద్రప్రసాద్ ఒకరు.... 90 శాతం ఆయన చేసిన రాసిన కథలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.;
RRR Sequel : టాలీవుడ్ టాప్ రైటర్ లలో విజయేంద్రప్రసాద్ ఒకరు.... 90 శాతం ఆయన చేసిన రాసిన కథలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా వచ్చిన RRR మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. 'ఆర్‌ఆర్‌ఆర్' సీక్వెల్‌పై విజయేంద్ర ప్రసాద్ తాజాగా స్పందించారు.
"ఓ రోజు ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' కొనసాగింపు చిత్రం గురించి అడిగాడు. నేను కొన్ని ఐడియాలు చెప్పా. తనకు, రాజమౌళికి బాగా నచ్చాయి. దేవుడి దయ ఉంటే సీక్వెల్ వస్తుంది" అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక మహేష్ తో సినిమాకి ఇంకా కథ ఫైనల్ కాలేదని అదే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చారాయన.
అటు డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన RRR మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు. వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించాడు.
ప్రపంచవ్యాప్తంగా RRR మూవీ ఏడు రోజుల్లో ఏడు వందల కోట్లను కొల్లగొట్టింది.