KV Vijayendra Prasad : నా సినిమాలే నన్ను రాజ్యసభకు తీసుకువచ్చాయి.. ఆ స్వాతంత్య్రయోధుడిపై కథ రాస్తున్నా..
KV Vijayendra Prasad : ప్రముఖ సినీరచయిత బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.;
KV Vijayendra Prasad : ప్రముఖ సినీరచయిత బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరవిషయాలను చెప్పారు. కథలే తనను రాజ్యసభకు తీసుకొచ్చాయని అన్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికవడం సంతోషంగా ఉంది. బాధ్యతలు పెరిగినట్లు అనిపిస్తుంది. ఎంపీగా నాశక్తిమేరకు కృషి చేస్తానన్నారు.
ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే... నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్‌ఫౌజ్‌కు సంబంధించి కథ రాస్తున్నట్లు చెప్పారు. బంకించంద్ర చాలర్జీపైనా కూడా రాస్తున్నట్లు చెప్పారు. మహేశ్‌బాబు కోసం కూడా ఓ కథ సిద్ధం చేసానన్నారు. సౌత్ ఇండియాలో ప్రజలకు భావోద్వేగాలు ఎక్కువ.. అందుకే ఇక్కడి నుంచి మంచి కథలు సినిమాలు వస్తున్నాయన్నారు.