Yashika Anand: యషికా పూర్తిగా కోలుకుందోచ్.. బన్నీ పాటకి స్టెప్పులు..!
Yashika Anand: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'నోటా' సినిమాతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ కి ఒకేసారి హీరోయిన్ గా పరిచయమైంది.;
Yashika Anand: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'నోటా' సినిమాతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ కి ఒకేసారి హీరోయిన్ గా పరిచయమైంది యషికా ఆనంద్.. గతఏడాది ఓ రోడ్డు ప్రమాదానికి గురైన ఈ బ్యూటీ మంచానికే పరిమితమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తాజాగా ఓ డాన్స్ వీడియోని షేర్ చేసింది యషికా.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప చిత్రంలో సామీ.. నా సామీ అనే పాటకి స్టెప్పులేసింది ఈ అమ్ముడు.. ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ... ఏదో అలా ట్రై చేశాను. కానీ నేను సాధారణంగా నేనెలా డ్యాన్స్ చేస్తానో అలాగైతే చేయలేదు. ఇక్కడికి రావడానికే ఆరు నెలలు పట్టింది. కాబట్టి త్వరలోనే మళ్లీ డ్యాన్స్ చేస్తాను, కాకపోతే ఈ ప్రదేశంలో మాత్రం కాదంటూ రాసుకొచ్చింది.
ఈ వీడియో చూసిన అభిమానులు యషికా పూర్తి ఆరోగ్యంగా కనిపించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం నాలుగు సినిమాలలో యషికా హీరోయిన్ గా నటిస్తోంది.