Naveen Mullangi: కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్- క్యాపిటలిస్ట్ బాయ్ ఫ్రెండ్
Naveen Mullangi: టైటిల్ అయితే అదిరింది. మరి కంటెంట్ ఎలా ఉంటుందో..;
Naveen Mullangi: టైటిల్ అయితే అదిరింది. మరి కంటెంట్ ఎలా ఉంటుందో..ఏది ఏమైనా యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాడు ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఇంగ్లీషులో ఓ ఫీచర్ ఫిల్మ్ చేయడానికి మెగా ఫోన్ చేతబట్టాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
ఖమ్మంకు చెందిన నవీన్ ముళ్లంగి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన ప్యాషన్‌కి మెరుగులు దిద్ది సినిమా తీయాలన్న తన కలను సాకారం చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి తనే దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
విభిన్న భావజాలాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ప్రేమ కథ ఇది. ఈ చిత్రానికి అవసరమైన పలు సాంకేతిక అంశాల్లోనూ నవీన్ శిక్షణ తీసుకుని తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగిన ఇంగ్లీష్ సినిమాలు తీసి తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. ఇక నవీన్ సరసన హీరోయిన్‌గా శివ ప్రీతిక సుక్క హీరోయిన్‌గా నటిస్తోంది.