శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరలో, సీతయ్య, దేవదాసు వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వైవీఎస్.చౌదరి కొత్త సినిమాతో రానున్నారు.
కొంతవిరామం తర్వాత వైవీఎస్ కొత్త సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. తన అభిమాన దర్శకుడు. కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు పురస్కరించుకుని కొత్త సినిమాను ప్రకటించారు. ప్రతిభగల కొత్త నటీనటులతో, న్యూ ఏజ్ కథాంశంతో ఆధునిక సాంకేతికతతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని తెలిపారు.
ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని వైవీఎస్ చౌదరి ప్రకటనలో తెలిపారు.