మహారాష్ట్ర : హాస్పిటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. పది మంది మృతి..!
Maharashtra : మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా హాస్పిటల్ ఐసీయూలో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది.;
Maharashtra : మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా హాస్పిటల్ ఐసీయూలో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వార్డులో 17 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. మిగిలినవారిని మరో హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు.
సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగడానికి కారణమేంటనేది తెలియరాలేదు. ఉదయం 11 గంటల టైంలో ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హాస్పిటల్ లోని మిగతా ఫ్లోర్లలోనూ దట్టంగా పొగ కమ్మేసింది.
ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఐసీయూ కరోనా రోగులకు చికిత్స అందించడం కోసం ఇటీవలే నిర్మించామన్నారు మంత్రి నవాబ్ మాలిక్. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు.