దేశంలో గుండె పోటు మరణాలు పెరుగుతోన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటుతో మరణిస్తున్నారు. చదువుకునే పిల్లలకు కూడా గుండె పోటు వస్తుంది. ఈ నేపథ్యంలో ఆందోళన నెలకొంది. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థిని సాహితి(15) హార్ట్ అటాక్‌తో మరణించింది. నిన్న రాత్రి బాలికకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు.