శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3.5 కిలోల భారీగా బంగారాన్ని డీఆర్ఎస్ఐ అధికారులు పట్టుకున్నారు. మస్కట్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు డీఆర్ఎస్ఐ అధికా రులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన డీఆర్ఎస్ఐ అధికారులు స్మగ్లర్ విమాన సిబ్బంది ద్వారా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో గురువారం మస్కట్ నుంచి వచ్చిన విమానంలో బంగారం తరలిస్తున్నట్లు అనుమానించిన డీఆర్ఐ అధికారులు గ్రౌండ్ స్టాప్పై నిఘా సారిం చారు. మస్కట్ నుంచి వచ్చిన స్మగర్ల్ గ్రౌండ్ స్టాఫ్ కు బంగారం అందించడం, వారు ఆ బంగారాన్ని బయటికి తీసుకొచ్చేందుకు యత్నించడంపై ప్రత్యేక దృష్టి సారించిన డీఆర్ఎస్ఐ బృందాలు 3.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.
అనంతరం స్మగ్లర్ కు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్ ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మస్కట్ విమానం తరచూ బంగారం తరలిస్తున్న స్మగ్లర్ ఎయిర్ పోర్ట్ నుంచి పార్కింగ్ వరకు బంగారం తీసుకొచ్చి ఇచ్చే బాధ్యతను గ్రౌండ్ప్కు అప్పగిస్తున్న విచారణలో తేలింది. డీఆర్ఎస్ఐ దాడులలో పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 3 కోట్ల 45 లక్షల రూపాయలు ఉంటుందని అంచానా వేశారు. అలాగే బంగారం స్మగ్లింగ్ పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.